Share News

మైనార్టీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Jun 05 , 2026 | 05:05 AM

మైనార్టీల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు.

మైనార్టీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి

  • బాబు హయాంలోనే మైనార్టీల సంక్షేమం: మంత్రి ఫరూక్‌

  • అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం

అమరావతి, జూన్‌ 4(ఆంధ్రజ్యోతి): మైనార్టీల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణబద్ధంగా కృషి చేస్తోందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన మైనార్టీ విద్యార్థులను అమరావతి సచివాలయంలో గురువారం మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత విద్యతోనే ఉన్నత స్థాయికి ఎదిగి, దేశ నిర్మాణంలో పాలుపంచుకోగలరన్నారు. మైనార్టీల కుటుంబాల్లో విద్యార్థుల శ్రేయోభివృద్ధికి కూటమి ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వక్ఫ్‌బోర్డు ద్వారా తాలీం ఏ హునర్‌ పథకం కింద కార్పొరేట్‌ కళాశాలల్లో ఉచిత రెసిడెన్షియల్‌ ఇంటర్‌ విద్య కోసం టాలెంట్‌ టెస్ట్‌ నిర్వహించి 250 మందిని ఎంపిక చేశామన్నారు. మైనార్టీ కుటుంబాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఉచిత డీఎస్సీ శిక్షణ , పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

Updated Date - Jun 05 , 2026 | 05:05 AM