వెదురు వనరుల వినియోగానికి టాస్క్‌ఫోర్స్
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:47 AM
రాష్ట్రంలోని వెదురు వనరులకు ఉన్న గణనీయమైన ఆర్థిక, పర్యావరణ, జీవనోపాధి అవకాశాలను వినియోగించుకునే లక్ష్యంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన..
అమరావతి, జూన్ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వెదురు వనరులకు ఉన్న గణనీయమైన ఆర్థిక, పర్యావరణ, జీవనోపాధి అవకాశాలను వినియోగించుకునే లక్ష్యంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా అటవీశాఖ, పంచాయతీరాజ్, పరిశ్రమలు, గిరిజన సంక్షేమ శా ఖల ముఖ్యకార్యదర్శులు, అడవుల ముఖ్య సంరక్షణాధికారి, జిల్లా కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులు, డీఆర్‌డీఏ పీడీలు, జిల్లా అటవీ అధికారులు, కన్వీనర్‌గా సెర్ఫ్ సీఈవో, ప్రత్యేక ఆహ్వానితులుగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెన్(ఐఎస్‌బీ) ప్రతినిధితో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. సెర్ప్ సీఈవో అభ్యర్ధన మేరకు చింతూరు డివిజన్‌లో స్వయంసహాయక సంఘాలకు వెదురు సేకరణ ప్రాంతాల కేటాయింపు జరిగింది. రాష్ట్రం లో వెదురు వనరుల ద్వారా గణనీయమైన ఆర్థిక, పర్యావరణ, జీవనోపాధి సామర్ధ్యాన్ని వినియోగించుకునే లక్ష్యం తో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.