Share News

‘మిషన్‌ మార్చ్‌’ ప్రారంభం

ABN , Publish Date - Jul 14 , 2026 | 04:44 AM

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగ తి వంద శాతం ఉత్తీర్ణత కోసం పాఠశాల విద్యాశాఖ ‘మిషన్‌ మార్చ్‌’ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది.

‘మిషన్‌ మార్చ్‌’ ప్రారంభం

  • ప్రభుత్వ స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యం

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగ తి వంద శాతం ఉత్తీర్ణత కోసం పాఠశాల విద్యాశాఖ ‘మిషన్‌ మార్చ్‌’ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది. నవంబరు 30 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. అరగంట సమయం పాఠ్యాంశాల పునఃశ్చరణకు, అరగంట స్లిప్‌టె్‌స్టకు కేటాయిస్తారు. విద్యార్థులను షైనింగ్‌ స్టార్స్‌, రైజింగ్‌ స్టార్స్‌గా వర్గీకరిస్తారు. మిషన్‌ మార్చ్‌ పూర్తయ్యాక పాఠశాల విద్యాశాఖ ఎప్పటిలాగే వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమల్లోకి తెస్తుంది. ఏటా వంద రోజుల ప్రణాళికే అమలౌతోంది.

Updated Date - Jul 14 , 2026 | 04:47 AM