Share News

వైసీపీ హయాంలో లిడ్‌క్యాప్‌ నిర్వీర్యం

ABN , Publish Date - Jul 09 , 2026 | 04:24 AM

‘లిడ్‌క్యాప్‌ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్వ వైభవం తీసుకొస్తున్నాం’ అని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి చెప్పారు.

వైసీపీ హయాంలో లిడ్‌క్యాప్‌ నిర్వీర్యం

  • కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్వ వైభవం తెస్తున్నాం

  • సచివాలయంలో లిడ్‌క్యాప్‌ షోరూమ్‌ ప్రారంభించిన మంత్రులు డోలా, సవిత

అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): ‘లిడ్‌క్యాప్‌ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్వ వైభవం తీసుకొస్తున్నాం’ అని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి చెప్పారు. అమరావతి సచివాలయంలో బుధవారం లిడ్‌ క్యాప్‌ లెదర్‌ షోరూమ్‌ (ఔట్‌ లెట్‌)ను మంత్రులు డోలా, సవిత, లిడ్‌క్యాప్‌ చైర్మన్‌ పిల్లి మాణిక్యాలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డోలా మాట్లాడుతూ లిడ్‌క్యాప్‌ ద్వారా చర్మకారుల అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వైసీపీ కబ్జాకోరుల చేతుల నుంచి లిడ్‌ క్యాప్‌ భూముల్ని కాపాడామన్నారు. మంత్రి సవిత మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు పది శాతం డిస్కౌంట్‌పై లెదర్‌ ఉత్పత్తులు విక్రయిస్తామన్నారు.

Updated Date - Jul 09 , 2026 | 04:25 AM