AP Government: జిల్లాల్లో రోడ్డు భద్రత కమిటీల పునరుద్ధరణ
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:41 AM
రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాల్లో రోడ్డు భద్రతా కమిటీలను పునరుద్ధరిస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
అమరావతి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాల్లో రోడ్డు భద్రతా కమిటీలను పునరుద్ధరిస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి జిల్లాలోనూ కలెక్టర్ చైర్మన్‌గా.. పోలీస్ కమిషనర్ లేదా ఎస్పీ, జిల్లా రవాణా అధికారి, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ, జాతీయ రహదారుల ఈఈ, కేంద్ర రవాణా శాఖ ప్రతినిధి, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ, జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కమిషనర్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్, రోడ్డు భద్రతపై పనిచేసే ఎన్‌జీవో, ఏపీఎ్‌సఆర్టీసీ జిల్లా అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. జిల్లాల్లో రోడ్డు భద్రతపై సమగ్రంగా చర్చించి ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్ల గుర్తించడం, ఇంజనీరింగ్ లోపాలు సరిదిద్దడం, ట్రాఫిక్ నియంత్రణ, ఎమర్జెన్సీ వైద్య సేవల సమన్వయం చేస్తుంది.