Share News

నేడు అన్నదాత నిధుల విడుదల

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:15 AM

రాష్ట్రంలోని అన్నదాతలకు శుభవార్త! అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ పథకం కింద రూ.3,125.47కోట్లను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు.

నేడు అన్నదాత నిధుల విడుదల

  • రైతుల ఖాతాల్లో రూ.3,125 కోట్లు

రాష్ట్రంలోని అన్నదాతలకు శుభవార్త! అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ పథకం కింద రూ.3,125.47కోట్లను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్ల గ్రామం నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలకు నేరుగా లబ్ధి కలిగించనున్నారు. 2026-2027కు గాను తొలివిడతగా ఈ నిధులను విడుదల చేస్తున్నారు. ఇందులో రాష్ట్రం వాటా రూ.2,342.92 కోట్లు కాగా, కేంద్రం వాటా రూ.782.55 కోట్లు. లబ్ధిదారుల్లో భూయజమానులైన రైతులు 45,69,817 మంది ఉండగా, అటవీ హక్కుల చట్టం కింద సాగు చేస్తున్న ఆర్వోఎఫ్ఆర్‌ రైతు కుటుంబాలు 1,16,021 ఉన్నాయి. ఈ విడత రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు, కేంద్రం రూ. 2వేలు చొప్పున కలిపి, ఒక్కో రైతు కుటుంబానికి రూ.7వేలు జమ కానున్నాయి. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు శనివారం పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు.

Updated Date - Jun 20 , 2026 | 04:17 AM