పెన్షన్లకు 2711 కోట్లు విడుదల
ABN , Publish Date - Jun 29 , 2026 | 05:02 AM
రాష్ట్రవ్యాప్తంగా జూలైలో 62,19,648 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,711.79 కోట్లు విడుదల చేసినట్లు..
కొత్తగా మంజూరైన 7792 పింఛన్లకూ నిధులు: కొండపలి
అమరావతి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా జూలైలో 62,19,648 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,711.79 కోట్లు విడుదల చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన (సెర్ప్) మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 1న ఉదయం నుంచే పెన్షన్లు పంపిణీ చేస్తామని, కొత్తగా మంజూరైన 7792 మంది వితంతు లబ్ధిదారులకు రూ.3.12 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్ల కోసం రూ.68,598.44 కోట్లు ఖర్చు చేసిందన్నారు.