నెట్‌వర్క్ ఆస్పత్రులకు 501 కోట్లు చెల్లింపు
ABN , Publish Date - May 02 , 2026 | 04:10 AM
ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అనుబంధ ప్రైవే టు ఆస్పత్రుల యాజమాన్యాలకు చెల్లించాల్సిన బకాయిల్లో ప్రభుత్వం రూ.501 కోట్లు చెల్లించింది.
అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అనుబంధ ప్రైవే టు ఆస్పత్రుల యాజమాన్యాలకు చెల్లించాల్సిన బకాయిల్లో ప్రభుత్వం రూ.501 కోట్లు చెల్లించింది. పెండింగ్‌లో ఉన్న రూ.2200 కోట్లలో ‘‘ట్రై-పార్టీ బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్’’ విధానంలో రూ.1000 కోట్లు చెల్లించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్, ఆస్పత్రుల యాజమాన్యాల మధ్య కుదిరిన ఒప్పందాలను అనుసరించి గత సోమవారం నుంచి చెల్లింపులు జరుగుతున్నాయి. మొత్తం 278 ఆస్పత్రుల యాజమాన్యాలకు రూ.501 కోట్ల వరకూ చెల్లించినట్లు ఎన్డీఆర్ వైద్య సేవా ట్రస్టు ఇన్‌చార్జి సీఈవో చక్రధరబాబు తెలిపారు. బిల్ డిస్కౌంటింగ్ విధానంలో బకాయిలు పొందేందుకు 873కు గానూ 531 ఆస్పత్రుల యాజమాన్యాలు దరఖాస్తు చేశా యి. ఆస్పత్రుల యాజమాన్యాలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు చెల్లింపులు జరుగుతున్నాయని ట్రస్ట్ సీఈవో తెలిపారు. మిగిలిన బకాయిలు రెండో విడతలో విడుదల చేస్తామని వెల్లడించారు.