Share News

వేటకు విరామం.. జాలర్లకు సాయం

ABN , Publish Date - May 19 , 2026 | 06:14 AM

వేట నిషేధ కాలంలో జీవనోపాధికి జాలర్లు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.20వేలు చొప్పున సాయం చేస్తోంది.

వేటకు విరామం.. జాలర్లకు సాయం

  • నేడు నిధులు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు

అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): వేట నిషేధ కాలంలో జీవనోపాధికి జాలర్లు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.20వేలు చొప్పున సాయం చేస్తోంది. ‘మత్స్యకారుల సేవలో’ పేరుతో రాష్ట్రంలోని 1,30,796 కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నది. మంగళవారం నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ నిధులు విడుదల చేయనున్నారు. ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌14 వరకు సముద్రంలో మత్స్యసంపద సంరక్షణ, వృద్ధి కోసం 61 రోజులపాటు ప్రభుత్వం వేట నిషేధాన్ని అమలు చేస్తోంది. ఈ వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలు జీవనోపాదికి ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో వేట నిషేధ భృతిని రూ.10వేలు ఇవ్వగా, కూటమి అధికారంలోకి వస్తే.. రూ.20వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక 2025లో 1,21,433 కుటుంబాలకు రూ.243కోట్లు విడుదల చేసి, రూ.20వేల చొప్పున సాయం చేశారు. నిరుడు కన్నా సుమారు 9వేల మంది లబ్ధిదారులు పెరగ్గా, రూ.19లక్షలు అదనంగా విడుదల చేసింది.

Updated Date - May 19 , 2026 | 06:14 AM