Share News

ఇంటికో పారిశ్రామికవేత్త!

ABN , Publish Date - Mar 18 , 2026 | 04:40 AM

రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల అభివృద్ధిని వేగవంతం చేయడంతోపాటు 2030 నాటికి ఏపీని ‘ఒక కుటుంబం- ఒక పారిశ్రామికవేత్త’ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో...

ఇంటికో పారిశ్రామికవేత్త!

  • ఏపీ సీఎంఈపీ అమలుకు ఉత్తర్వులు

అమరావతి, మార్చి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల అభివృద్ధిని వేగవంతం చేయడంతోపాటు 2030 నాటికి ఏపీని ‘ఒక కుటుంబం- ఒక పారిశ్రామికవేత్త’ రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ‘ఏపీ చీఫ్‌ మినిస్టర్స్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ప్రోగ్రాం(ఏపీ సీఎంఈపీ)’ అమలుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్త పారిశ్రామికవేత్తలపై ఆర్థిక భారాన్ని తగ్గంచడం ఈకార్యక్రమం లక్ష్యం. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే తయారీ యూనిట్ల కు మార్జిన్‌ మనీ సబ్సిడీ రూ.75 లక్షల వరకు పెంపు, నిధుల ప్రవాహం, ఎంఎస్ఎంఈల ఏర్పాటును ప్రోత్సహించడానికి రూ.500 కోట్ల నిధి(కార్పస్‌ ఫండ్‌)ని కేటాయించింది. ఈ విషయంలో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ను భాగస్వామిని చేయాలని ఆదేశించింది.

Updated Date - Mar 18 , 2026 | 04:40 AM