గ్రూప్-1లో ఎంపికైన 25 మంది డీఎస్పీలకు పోస్టింగ్
ABN , Publish Date - May 27 , 2026 | 06:04 AM
ఏపీపీఎస్సీ గ్రూప్-1 2025 పరీక్ష ద్వారా ఎంపికైన 25మంది డీఎస్పీలకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. అభ్యర్థుల పూర్వాపరాల పరిశీలన, ఇంటెలిజెన్స్ నివేదికలు, వైద్య పరీక్షల పూర్తి అనంతరం..
అమరావతి, మే 26(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ గ్రూప్-1 2025 పరీక్ష ద్వారా ఎంపికైన 25మంది డీఎస్పీలకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. అభ్యర్థుల పూర్వాపరాల పరిశీలన, ఇంటెలిజెన్స్ నివేదికలు, వైద్య పరీక్షల పూర్తి అనంతరం వీరిని నియమించినట్లు మంగళవారం జారీచేసిన జీవోలో పేర్కొంది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్లపై తుది తీర్పులకు లోబడి ఈ నియామకాలు ఉంటాయని స్పష్టం చేసింది. బీసీ వర్గానికి చెందిన అభ్యర్థుల నియామకాలు సైతం న్యాయపరమైన నిర్ణయాలకు అనుగుణంగా ఉంటాయని పేర్కొంది. కొత్తగా నియమితులైన డీఎస్పీలు మూడేళ్ల వ్యవధిలో రెండున్నరేళ్ల పాటు ప్రొబేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. నియామక ఉత్తర్వులు అందుకున్న 30 రోజుల్లోపు డీజీపీ కార్యాలయంలో విధుల్లో చేరాల్సి ఉంటుంది.