డీడీఓలకు పోస్టింగ్‌లు
ABN , Publish Date - Jun 29 , 2026 | 05:52 AM
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలోని పలువురు డివిజనల్ డెవల్‌పమెంట్ ఆఫీసర్లు(డీడీఓ )లకు స్థానాలు కేటాయిస్తూ ఆ శా ఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖలోని పలువురు డివిజనల్ డెవల్‌పమెంట్ ఆఫీసర్లు(డీడీఓ )లకు స్థానాలు కేటాయిస్తూ ఆ శా ఖ ఉత్తర్వులు జారీ చేసింది. సామర్లకోట ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ డి.శ్రీనివాసరావును కొవ్వూరు డీడీఓగా, వెయిటింగ్‌లో ఉన్న పురుషోత్తంను ఏలూరు డ్వా మా డీవీఓగా, అనంతపురం జిల్లా కదిరి ఏపీడీ బి.శకుంతలను అనంతపురం డీడీఓగా నియమిస్తూ ఆదేశాలిచ్చింది. విజయనగరం డ్వామా అడిషనల్ పీడీ బి. రామప్రసాద్‌ను పోలవరం జిల్లా డ్వామా పీడీగా, ఒంగోలు డీడీఓ సువార్తను ప్రకాశం జిల్లా వాటర్‌షెడ్‌కు అదనపు పీడీగా నియమించడంతోపాటు మార్కాపు రం జిల్లా డ్వామా పీడీగా నియమించారు. ప్రకాశం జిల్లా వాటర్‌షెడ్ అడిషనల్ పీడీ టి.హనుమంతరావును సంతనూతలపాడు ఏపీడీగా, ఎంపీడీఓ పి.అనూరాధను నూజివీడు డీడీఓగా నియమించారు.