‘మన మిత్ర’కు హాయ్ చెబితే చాలు..
ABN , Publish Date - Feb 05 , 2026 | 05:18 AM
మీకు స్మార్ట్ ఫోన్, వాట్సాప్ ఉందా..! మీ వాట్సాప్ సెల్ నంబరు ఆధార్‌కు లింకై ఉందా? ఉంటే మీ వాట్సా్‌పలో 955230 0009 నంబరు టైప్ చేయగానే... ‘మన మిత్ర’ స్పందిస్తుంది.
సేవ, సమస్య... ఏదైనా వాట్సా్‌పలోనే పరిష్కారం
9552300009 నంబరుతో ఏపీ పౌర సేవలు
అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): మీకు స్మార్ట్ ఫోన్, వాట్సాప్ ఉందా..! మీ వాట్సాప్ సెల్ నంబరు ఆధార్‌కు లింకై ఉందా? ఉంటే మీ వాట్సా్‌పలో 955230 0009 నంబరు టైప్ చేయగానే... ‘మన మిత్ర’ స్పందిస్తుంది. ఏపీ పౌర సేవలు వాట్సాప్ గవర్నెన్స్ అంటూ చాట్ ఓపెన్ అవుతుంది. దానిలో హాయ్ అని టైప్ చేస్తే చాలు... మీరు ఏదైనా సమస్య(గ్రీవెన్స్) లేదా ఫీడ్‌బ్యాక్ చెప్పాలనుకుంటే మాకు తెలియచేయండి అంటూ ఒక మెసేజ్ వస్తుంది. ఆ వెంటనే ‘మన మిత్ర’ (వాట్సాప్ గవర్నెన్స్)కు స్వాగతం అంటూ మరో మెసేజ్ వస్తుంది. దానికింద ‘సేవను ఎంచుకోండి’ అంటూ ఆకుపచ్చ రంగులో దర్శనమిస్తుంది. సమస్య అయినా, సేవ అయినా అంతా వాట్సా్‌పలోనే పని అయిపోతుంది. భాషా సమస్య కూడా లేదు. తెలుగు లేదా ఇంగ్లీషును మీరు ఎంచుకోవచ్చు. మన మిత్రను ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకూ 50 లక్షల మంది వినియోగదారులకు రెండున్నర కోట్లకు పైగా ప్రభుత్వ సేవలు అందాయి. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లో 1,000కిపైగా ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయి. వాటిని రాష్ట్రంలో నివాసముంటున్న వారే కాదు... రాష్ట్రం వెలుపల వినిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారూ వినియోగించుకునే వీలుంది. ఆస్తిపన్ను, విద్యార్హత పత్రాలు, కుల ధృవీకరణ పత్రాలు తదితర ప్రభుత్వ సేవలను వినియోగించుకునేందుకు సంబంధిత కార్యాలయాలకు వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు మన మిత్ర వాట్సప్ నంబరు 9552300009తో ఈ పనులన్నింటినీ ఇంటి నుంచే చేసుకోవచ్చు.
ఆర్టీసీ టికెట్ రిజర్వేషన్, మున్సిపాలిటీలు, పంచాయితీల్లో అస్తిపన్ను, నీటి పన్ను, కరెంటు బిల్లుల చెల్లింపులు, రెవెన్యూ, పోలీసు సేవలు, పింఛన్లు, వివిధ సర్టిఫికెట్లు, ప్రభుత్వం నిర్వహించే పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు, ఫలితాలు ఇందులో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పట్టాదారు పాసుపుస్తకం, వన్ బీ అండగల్ కాపీలను కూడా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సహాయంతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం సేవలు కూడా దీని ద్వారా లభిస్తాయి.