సూక్ష్మ ఖనిజాల పాలసీకి కీలక సవరణలు
ABN , Publish Date - Feb 04 , 2026 | 06:02 AM
ప్రభుత్వరంగ సంస్థలు, వాటి పరిధిలోని కంపెనీలకు నామినేషన్ ప్రతిపాదికన సూక్ష్మ ఖనిజాలు లీజుకు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది.
అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వరంగ సంస్థలు, వాటి పరిధిలోని కంపెనీలకు నామినేషన్ ప్రతిపాదికన సూక్ష్మ ఖనిజాలు లీజుకు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈమేరకు సూక్ష్మ ఖనిజాల విధానం(మైనరల్ మినరల్ పాలసీ)-2025లో సవరణలు తీసుకొచ్చింది. అలాగే, సూక్ష్మ ఖనిజాల రాయితీ నిబంధనలు-1966లో సవరణలు చేసింది. రానున్న రోజుల్లో ఏపీఎండీసీ చేపట్టే మైనింగ్ లీజులకు ఈ నియమాలే వర్తించనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీఎండీసీ వచ్చే మూడేళ్లలో చెల్లించే సీనరేజీ, రాయలిటీ ఫీజులను అడ్వాన్స్‌గా గనుల శాఖ వసూలు చేయనుంది.