కాలువ మరమ్మతులకు షార్ట్ టెండర్లు
ABN , Publish Date - May 26 , 2026 | 05:59 AM
షార్ట్ టెండర్ల ద్వారా కాలువ మరమ్మతు పనులను పూర్తి చేయాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. రూ. పది లక్షల విలువైన పనులను..
6502 పనుల పూర్తికి జల వనరుల శాఖ ఉత్తర్వులు
అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): షార్ట్ టెండర్ల ద్వారా కాలువ మరమ్మతు పనులను పూర్తి చేయాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. రూ. పది లక్షల విలువైన పనులను నామినేషన్ పద్ధతిపై సాగునీటి సంఘాల సమాఖ్యలు చేస్తున్నాయి. రూ.10 లక్షల కంటే ఎక్కువ విలువైన పనులు 6502 ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ పనులను వానాకాలంలోగా పూర్తి చేయడం ద్వారా ప్రతి ఎకరాకూ నీరందించవచ్చని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈమేరకు షార్ట్‌టెండర్ (ఏడు రోజుల్లోపు టెండర్ ఖరారు చేసేవి) పిలిచి పనులు అప్పగించాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. షార్ట్‌టెండర్ల ద్వారా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశిస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.