కొత్త ఎస్‌ఈసీపై ఆచితూచి..!
ABN , Publish Date - Apr 01 , 2026 | 05:11 AM
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ఆమె స్థానంలో రిటైర్డ్ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను నియమిస్తారని తొలుత ప్రచారం జరిగింది.
ముగిసిన నీలం సాహ్ని పదవీ కాలం
అమరావతి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ఆమె స్థానంలో రిటైర్డ్ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను నియమిస్తారని తొలుత ప్రచారం జరిగింది. మరికొందరి పేర్లు కూడా ఈ క్రమంలో వినిపించాయి. అయితే, కొత్త ఎస్‌ఈసీపై ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. సాధారణ ఎన్నికల విధులతోపాటు అదనంగా నియోజకవర్గాల పునర్విభన ప్రక్రియలోనూ కొత్త ఎస్‌ఈసీ పాల్గొనాల్సి ఉంటుంది. దీంతో మంచి ట్రాక్ రికార్డు ఉన్న అధికారి కోసం ప్రభుత్వం అన్వేషిస్తున్నట్టు సమాచారం. సత్వరమే ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా ఎస్‌ఈసీని నియమించాలి. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ పనులు ప్రారంభించింది కూడా. 45 రోజుల్లోపు అది తన నివేదిక ఇస్తుంది. ఈ లోపు కొత్త రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంది.