పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:26 AM
పశువుల అక్రమ రవాణాను అరికట్టే డిజిటల్ ట్రాన్స్‌పోర్ట్ సర్టిఫికెట్ వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): పశువుల అక్రమ రవాణాను అరికట్టే డిజిటల్ ట్రాన్స్‌పోర్ట్ సర్టిఫికెట్ వ్యవస్థకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శుక్రవారం డిజిటల్ ట్రాన్స్‌పోర్ట్ సర్టిఫికెట్ వ్యవస్థను పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఆన్‌లైన్ ద్వారా జారీ చేసే డిజిటల్ ట్రాన్స్‌పోర్ట్ సర్టిఫికెట్ జనరేషన్ సిస్టమ్‌ను ప్రారంభించి, మంత్రి మాట్లాడుతూ.. ఈ వ్యవస్థతో పశువుల రవాణా పారదర్శకంగా ఉంటుందన్నారు. పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఈ సర్టిఫికెట్ పొందిన తర్వాతే పశువులను రవాణా చేయాలని సూచించారు.