Share News

లోకాయుక్త నియామకానికి సెర్చ్‌ కమిటీ

ABN , Publish Date - May 26 , 2026 | 04:59 AM

రాష్ట్రంలో లోకయుక్త ఎంపిక కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రభుత్వం సెర్చ్‌ కమిటీని ఏర్పాటు చేసింది.

లోకాయుక్త నియామకానికి సెర్చ్‌ కమిటీ

అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లోకయుక్త ఎంపిక కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రభుత్వం సెర్చ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ), న్యాయశాఖ కార్యదర్శి సభ్యులుగా, సాధారణ పరిపాలనశాఖ(పొలిటికల్‌) ముఖ్యకార్యదర్శిని మెంబర్‌ కన్వీనర్‌గా నియమించింది. లోకాయుక్త పదవి కోసం అర్హత కలిగిన ఐదుగురు అభ్యర్థులతో సెర్చ్‌ కమిటీ ప్యానల్‌ను సిద్ధం చేస్తుంది.

Updated Date - May 26 , 2026 | 04:59 AM