Share News

పాఠశాల సదుపాయాల అభివృద్ధికి సొసైటీ

ABN , Publish Date - May 15 , 2026 | 04:55 AM

ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేకంగా సొసైటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పాఠశాల సదుపాయాల అభివృద్ధికి సొసైటీ

  • విరాళాల సేకరణకు త్వరలో పోర్టల్‌

అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేకంగా సొసైటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి ‘ఏపీ స్కూల్‌ ఇన్‌ఫ్రా డెవల్‌పమెంట్‌ సొసైటీ’గా నామకరణం చేసింది. దీనికి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. స్కూల్‌ ఇన్‌ఫ్రా కమిషనర్‌ కార్యదర్శిగా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వైస్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. మరో మంది అధికారులను సభ్యులుగా నియమించారు. అలాగే పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం డోనర్స్‌ పోర్టల్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దాతలు ఇచ్చే విరాళాలకు వంద శాతం పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు పేర్కొంది.

Updated Date - May 15 , 2026 | 04:56 AM