దేవాలయాలకు మాస్టర్ ప్లాన్
ABN , Publish Date - May 02 , 2026 | 04:49 AM
రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ మేరకు దేవదాయ శాఖ ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ..
సిద్ధం చేసేందుకు కమిటీ నియామకం
అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ మేరకు దేవదాయ శాఖ ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ హరిజవహర్‌లాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా విధులు నిర్వహించి రిటైర్ అయిన ఆర్.కొండలరావును సాంకేతిక సలహాదారుగా నియమించారు. దేవదాయ శాఖ ఆడిషనల్ కమిషనర్, చీఫ్ ఇంజనీర్, స్థపతి, విజయవాడలోని ఆర్కిటెక్ స్కూల్ డైరెక్టర్ ఎస్. రమేశ్, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఎస్. సుబ్బారావు, సంబంధిత ఆలయాల ఈవోలు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ మాస్లర్ ప్లాన్‌ను సిద్ధం చేయడంతో పాటు దానిప్రకారం ఆలయల రూపురేఖలు మార్చడానికి ఎంత నిధులు వెచ్చించాలి తదితర అంశాలపై ప్రభుత్వానికి, దేవదాయ శాఖ కమిషనర్‌కు నివేదిక అందించనుంది.