Share News

డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జిల గడువు పెంపు

ABN , Publish Date - Jun 23 , 2026 | 05:22 AM

రాష్ట్రంలోని 13 పూర్వపు జిల్లాల జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల(డీసీసీబీ) నాన్‌ అఫీషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిల పదవీ కాలాన్ని..

డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జిల గడువు పెంపు

అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 13 పూర్వపు జిల్లాల జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల(డీసీసీబీ) నాన్‌ అఫీషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27 నుంచి డిసెంబరు 26 వరకు ప్రస్తుత పర్సన్‌ ఇన్‌చార్జిలు పదవుల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 05:23 AM