Share News

ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం వెబ్‌సైట్‌ ప్రారంభం

ABN , Publish Date - Apr 12 , 2026 | 05:16 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీ జీడీఏ) నూతన వెబ్‌సైట్‌ను శనివారం ప్రారంభించారు. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో వెబ్‌సైట్‌ను...

ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం వెబ్‌సైట్‌ ప్రారంభం

  • వైద్యులంతా సభ్యులుగా చేరాలని విజ్ఞప్తి

గుంటూరు మెడికల్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీ జీడీఏ) నూతన వెబ్‌సైట్‌ను శనివారం ప్రారంభించారు. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఏపీ జీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ జయ్‌ధీర్‌, తొలి సభ్యత్వ కార్డును గుంటూరు వైద్య కళాశాల ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుజ్ఞాన్‌ బండారుకు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ జయ్‌ధీర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యుల సంఘం చరిత్రలో తొలిసారిగా వెబ్‌సైట్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ సర్వీసులో ఉన్న డాక్టర్లు తప్పనిసరిగా అసోసియేషన్‌లో సభ్యులుగా చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - Apr 12 , 2026 | 05:18 AM