Share News

అత్యవసర సేవల ప్రదేశంగా ‘భోగాపురం’

ABN , Publish Date - May 27 , 2026 | 06:02 AM

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును అత్యవసర సేవల ప్రదేశంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

అత్యవసర సేవల ప్రదేశంగా ‘భోగాపురం’

అమరావతి, మే 26(ఆంధ్రజ్యోతి): భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును అత్యవసర సేవల ప్రదేశంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ ప్రకటనతో భోగాపురం ఎయిర్‌పోర్టు కేంద్ర భద్రతా బలగాల అధీనంలోకి వెళ్లిపోయింది. విమానాశ్రయాన్ని 1971 అత్యవసర సేవల పరిధిలోకి తీసుకురావాలంటూ రాష్ట్ర విమానాశ్రయాభివృద్ధి సంస్థకు జీఎంఆర్‌ సంస్థ లేఖ రాసింది. ఆమేరకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది.

Updated Date - May 27 , 2026 | 06:03 AM