‘పప్పుధాన్యాల’పై స్టీరింగ్ కమిటీలు
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:58 AM
పప్పు ధాన్యాల సాగులో ఆత్మనిర్భరత కోసం ఉద్దేశించిన మిషన్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి రాష్ట్ర, జిల్లా స్థాయి ల్లో ప్రభుత్వం స్టీరింగ్ కమిటీలను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): పప్పు ధాన్యాల సాగులో ఆత్మనిర్భరత కోసం ఉద్దేశించిన మిషన్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి రాష్ట్ర, జిల్లా స్థాయి ల్లో ప్రభుత్వం స్టీరింగ్ కమిటీలను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర పప్పు ధాన్యాల స్టీరింగ్ కమి టీ, కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్టీరింగ్ కమిటీలను నియమించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల సమన్వయంతో ఆత్మనిర్భరత మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర వాటాలతో కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసి, అమలు చేయడం, అపరాల పంటల సాగు, ఉత్తత్తి, ఉద్పాదకత, మార్కెటింగ్ తదితర అంశాలపై అధ్యయనం చేయడం వంటి బాధ్యతలు ఈ స్టీరింగ్ కమిటీలకు అప్పగించింది. ఆయిల్‌పామ్ ఉప ఉత్పత్తులపై అధ్యయనానికి ఉద్యానశాఖ డైరెక్టర్ అధ్యక్షతన ప్రభుత్వం రాష్ట్ర కమిటీ నియమించింది.