Share News

ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం

ABN , Publish Date - Jul 23 , 2026 | 04:49 AM

‘‘ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదు.. ఉద్యోగులంతా మా కుటుం బ సభ్యులే. ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. మీ సమస్యలన్నింటినీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకె ళ్లి, వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చే స్తాం’’ అని ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రుల బృందం హామీ ఇచ్చింది.

ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం

  • ఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులే

  • సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారం

  • ఉద్యోగ సంఘాలకు మంత్రుల బృందం హామీ

  • పీఆర్సీ, ఐఆర్‌ ప్రకటనపై ఉద్యోగ నేతల డిమాండ్‌

  • పెండింగ్‌ డీఏలు, బకాయిలూ చెల్లించాలని వినతి

అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రభుత్వం, ఉద్యోగులు వేరు కాదు.. ఉద్యోగులంతా మా కుటుం బ సభ్యులే. ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. మీ సమస్యలన్నింటినీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకె ళ్లి, వీలైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చే స్తాం’’ అని ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రుల బృందం హామీ ఇచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తున్న తరహాలోనే ఉద్యోగుల సమస్యలపైనా కృషి చేస్తామని పేర్కొంది. బుధవారం అమరావతి సచివాలయంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో ని 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం సమావేశమైంది. దాదాపు 5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, సత్యకుమార్‌ యాదవ్‌ పాల్గొనగా, మరో మంత్రి నాడెండ్ల మనోహర్‌ వర్చువల్‌గా హాజరయ్యారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నేతలు వివరించిన సమస్యలను మంత్రు ల కమిటీ సావధానంగా ఆలకించింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు సానుకూలంగానే ఉన్నారని స్పష్టం చేసింది.


పీఆర్సీని ఏర్పాటు చేయాలి: విద్యాసాగర్‌

పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభు త్వం తక్షణమే పీఆర్సీని ఏర్పాటు చేయాలని, ఆలోపు మధ్యంతర ఉపశమనం(ఐఆర్‌) ప్రకటించాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ చైర్మన్‌ అలపర్తి విద్యాసాగర్‌ కోరారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు సంబంధించిన 70కి పైగా అంశాలను మంత్రుల బృందం దృష్టికి తీసుకెళ్లామన్నారు. 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయ ని, బకాయిలు చెల్లింపులు వేగవంతం చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన రూ.33 వేల కోట్లకు పైగా బకాయిల్లో ప్రస్తుత ప్రభు త్వం రూ.22వేల కోట్లను దశల వారీగా చెల్లించడా న్ని స్వాగతించారు. సర్వీసులో ఉన్న ఉద్యోగుల సరెండర్‌ లీవ్‌ బకాయిలుచెల్లించాలని, మిగిలిన బకాయిల చెల్లింపులపై రోడ్‌మ్యాప్‌ ప్రకటించాలన్నారు. హెల్త్‌కార్డుపై వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్‌ ఇంక్రిమెం ట్లు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు తదితర అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


వెంటనే పరిష్కరించాలి: బొప్పరాజు

ఉద్యోగుల ఆర్థికపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొ ప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. కారుణ్యనియామకా లు వెంటనే చేపట్టాలన్నారు. ఎలక్రిక్‌ బస్సులను ప్ర భుత్వమే కొనుగోలు చేసి సంస్థను బలోపేతం చే యాలన్నారు. భవిష్యత్‌ ప్రణాళికల కోసం ఆగస్టు 2 ఏపీ జేఏసీ సెక్రటేరియట్‌ భేటీ నిర్వహిస్తామన్నారు.

వెంటనే ఐఆర్‌ విడుదల చేయాలి: రామకృష్ణ

పీఆర్సీ ఏర్పాటుతో పాటు వెంటనే ఐఆర్‌ విడుద ల చేయాలని కోరామని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి రామకృష్ణ తెలిపారు. రెండేళ్లు గడుస్తున్నా పీఆర్సీ వేయకపోవడంతో ఉద్యోగులు అభద్రతాభావంలో ఉన్న విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ‘సచివాలయం హెచ్‌వోడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అమరావతిలో నిర్మించబోయే టవర్స్‌లో అన్ని శాఖలు ఒకే టవర్‌లో ఉంచేలా చూడాలి. జీఏడీలో దాదాపు 300 మందికి పదోన్నతులు ఇచ్చినప్పటికీ అసెంబ్లీ, ఫైనాన్స్‌లో రెండేళ్లుగా పెడింగ్‌లో ఉన్న పదోన్నతుల సమస్యను పరిష్కరించాలి.’ అని సమావేశంలో కోరామని రామకృష్ణ వివరించారు.

ఈఎల్‌ సొమ్ములు కోరాం: హృదయరాజు

ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు మాట్లాడుతూ పీఆర్సీని నియమించి, సమావేశం ముగిసేలోపు ప్రకటన చేయాలని కోరామని తెలిపారు. 30శాతం ఐఆర్‌, ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పెండింగ్‌ ఈఎల్స్‌ ఎనక్యాష్‌మెంట్, పెండింగ్‌ డీఏల మంజూరు,ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్‌ రద్దుపై కోరామని చెప్పారు.


త్వరితగతిన పరిష్కరిస్తాం: పయ్యావుల

ఉద్యోగ సంఘాల ప్రతినిధులు విన్నవించిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీఆర్సీ ఏర్పాటు, ఐఆర్‌ ప్రకటన, పెండింగ్‌ డీఏలు, బిల్లులు సకాలంలో చెల్లించాలన్న డిమాండ్లు వచ్చాయని చెప్పారు. ఉద్యోగులపై చేసే ఖర్చును ప్రభుత్వం పెట్టుబడిగానే భావిస్తుందన్నారు. 2004 సెప్టెంబరు కన్నా ముందు ఉద్యోగాల్లో చేరిన సీపీఎస్‌ ఉద్యోగులకు ఓపీఎస్‌ అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని గుర్తుచేశారు. గత ప్రభుత్వం నుంచి వచ్చిన అప్పుల భారం నుంచి రాష్ట్రాన్ని ఏవిధంగా బయటకు తేవాలనే దానిపై సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని వివరించారు. కాగా, ఉద్యోగులకు సంబంధించిన అంశాలను వీలైనంత వరకూ చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ అన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 04:51 AM