Share News

ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు అనుమతి

ABN , Publish Date - Aug 14 , 2026 | 04:55 AM

అనారోగ్య కారణాలతో ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది కుటుంబాలపై ఏపీఎస్ఆర్టీసీ కారుణ్యం చూపించింది. రాష్ట్రవ్యాప్తంగా 76 మంది ఆర్టీసీ సిబ్బంది అనారోగ్యం..

ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు అనుమతి

అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): అనారోగ్య కారణాలతో ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది కుటుంబాలపై ఏపీఎస్ఆర్టీసీ కారుణ్యం చూపించింది. రాష్ట్రవ్యాప్తంగా 76 మంది ఆర్టీసీ సిబ్బంది అనారోగ్యం బారినపడి విధుల నుంచి విశ్రాంతి తీసుకున్నారు. వీరిలో 43 మంది వైద్య పరీక్షలకు హాజరై పదవీ విరమణ అనుమతి పొందారు. మరో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. రోగాల బారినపడిన వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల ఏపీఎ్‌సఆర్టీసీ ప్రతిపాదనలు పంపింది. దీనిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. కారుణ్య నియామకాలు చేపట్టేందుకు అనుమతించింది. ఈమేరకు రవాణా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Aug 14 , 2026 | 04:57 AM