ప్రజల చెంతకు న్యాయ సేవలు
ABN , Publish Date - May 15 , 2026 | 05:05 AM
సత్వర న్యాయం అందించేందుకు, పెండింగ్ కేసులు తగ్గించేందుకు రాష్ట్రంలో 96 కొత్త, అదనపు కోర్టుల ఏర్పాటు చేపట్టినట్టు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ చెప్పారు.
96 కొత్త కోర్టులు మంజూరు.. జీపీ, ఏజీపీల ఖాళీల భర్తీ: ఫరూక్
అమరావతి, మే 14(ఆంధ్రజ్యోతి): సత్వర న్యాయం అందించేందుకు, పెండింగ్ కేసులు తగ్గించేందుకు రాష్ట్రంలో 96 కొత్త, అదనపు కోర్టుల ఏర్పాటు చేపట్టినట్టు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ చెప్పారు. గురువారం అమరావతి సచివాలయంలో న్యాయశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే కొత్త కోర్టుల ప్రారంభోత్సవాలు జరిగాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న జీపీ, ఏజీపీల పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. జ్యుడీషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పథకం కింద ఎక్కువగా కేంద్ర నిధులు రాబట్టడానికి అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.