పేదల ఇళ్లకు 121 కోట్లు అదనపు నిధులు మంజూరు
ABN , Publish Date - Jul 11 , 2026 | 04:32 AM
పేదల గృహ నిర్మాణ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.121.70 కోట్లకు పైగా అదనపు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనాపరమైన అనుమతినిస్తూ..
అమరావతి, జూలై 10(ఆంధ్రజ్యోతి): పేదల గృహ నిర్మాణ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.121.70 కోట్లకు పైగా అదనపు నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనాపరమైన అనుమతినిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో పీఎంఏవై (అర్బన్-బీఎల్‌సీ) పథకం కింద పేదల గృహ నిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా 2026-27 ఆర్థిక సంవత్సరంలో సప్లిమెంటరీ గ్రాంట్ల ద్వారా నిధులు పొందేలా ట్రెజరీ, త్రైమాసిక నియంత్రణ నిబంధనల నుంచి మినహాయుంపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు ఇచ్చారు.