Share News

సీఆర్‌డీఏ కమిషనర్‌గా విజయరామరాజు

ABN , Publish Date - Mar 21 , 2026 | 05:07 AM

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా 2012 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి విజయరామరాజును ప్రభుత్వం నియమించింది.

సీఆర్‌డీఏ కమిషనర్‌గా విజయరామరాజు

  • పౌరసరఫరాల శాఖకు కన్నబాబు బదిలీ

  • రెండు కొత్త జిల్లాలకు కలెక్టర్లు నియామకం

  • మార్కాపురం కలెక్టర్‌గా విజయసునీత

  • పోలవరం కలెక్టర్‌గా కె.దినేశ్‌ కుమార్‌

అమరావతి, గుంటూరు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌గా 2012 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి విజయరామరాజును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సీఆర్‌డీఏ కమిషనర్‌గా ఉన్న కె.కన్నబాబును బదిలీపై పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా పంపించింది. ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సౌరబ్‌ గౌర్‌ను రిలీవ్‌ చేసింది. అలాగే కొత్తగా ఏర్పడిన రెండు జిల్లాలకు ఇన్‌చార్జ్‌ కలెక్టర్ల స్థానంలో కొత్త కలెక్టర్లను నియమించింది. 2014 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి ఎం.విజయసునీతను మార్కాపురం జిల్లా కలెక్టర్‌గా, ఆయుష్‌ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న కె.దినేశ్‌ కుమార్‌ను పోలవరం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మార్కాపురం కలెక్టర్‌గా నియమితులైన విజయసునీత ప్రస్తుతం అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె స్థానంలో ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్న పఠాన్‌శెట్టి రవిసుభాశ్‌కు అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ విభాగం అదనపు బాధ్యతలు అప్పగించింది.

Updated Date - Mar 21 , 2026 | 05:08 AM