ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రవాసాంధ్రులు
ABN , Publish Date - Jul 08 , 2026 | 05:10 AM
వివిధ దేశాల్లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులుగా ముగ్గురు ప్రవాసాంధ్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రవాసాంధ్రులు ఎక్కువగా ఉన్న మధ్యప్రాచ్య అరబ్బు దేశాలు, ఆగ్నేయ ఆసి యా దేశాలకు..
గల్ఫ్ దేశాలకు రావి రాధాకృష్ణ, ఐరోపాకు జయకుమార్
మిగిలిన దేశాలకు శ్రీనివాస్ పల్లపోటు
ఉత్తర అమెరికా పెట్టుబడుల ప్రధాన సంధానకర్తగా సతీశ్ మండువ
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
వివిధ దేశాల్లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులుగా ముగ్గురు ప్రవాసాంధ్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రవాసాంధ్రులు ఎక్కువగా ఉన్న మధ్యప్రాచ్య అరబ్బు దేశాలు, ఆగ్నేయ ఆసి యా దేశాలకు రావి రాధకృష్ణ, ఐరోపా దేశాలకు జయకుమార్ గుంటుపల్లి, ప్రపంచంలోని మిగిలిన దేశాలకు శ్రీనివాస్ పల్లపోటును నియమించారు. అలాగే ఉత్తర అమెరికాలో పెట్టుబడుల వ్యవహారాల కొరకు ప్ర ధాన సంధానకర్తగా సతీశ్ మండువను నియమించారు. సౌదీ అరేబియా లో ఆయిల్, గ్యాస్ రంగంలో వ్యాపారం చేసే రాధాకృష్ణ స్వస్థలం కోనసీమ జిల్లా సఖీనేటిపల్లి మండలం. గత ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. ఐరోపాలో ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులైన జయకుమార్ గుంటుపల్లి స్వస్థలం మచిలీపట్నం. దశాబ్ద కాలానికిపైగా టీడీపీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇతరులకు కేటాయించని అన్ని దేశాలకు ఆస్ట్రేలియాలో నివసించే గుడివాడకు చెందిన పల్లపోతు శ్రీనివాసరావును ప్రత్యేకప్రతినిధిగా నియమించారు. అమెరికాలో పెట్టుబడుల వ్యవహారాలకు సంధానకర్తగా నియమితులైన సతీశ్ మండువది ప్రకాశం జిల్లా.