Share News

రాష్ట్రానికి రూ.2,545 కోట్ల ఉపాధి నిధులు

ABN , Publish Date - Jul 08 , 2026 | 05:12 AM

వీబీజీరామ్‌జీ పథకం కింద ఏపీకి తొలివిడతగా రూ.2,545.50 కోట్లు విడుదలయ్యాయని కేంద్ర గ్రామీణాభివృద్థి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు.

రాష్ట్రానికి రూ.2,545 కోట్ల ఉపాధి నిధులు

  • వికసిత్‌ భారత్‌ సాధనలో ఏపీ ముందంజ: పెమ్మసాని చంద్రశేఖర్‌

న్యూఢిల్లీ/గుంటూరు, జూలై 7(ఆంధ్రజ్యోతి): వీబీజీరామ్‌జీ పథకం కింద ఏపీకి తొలివిడతగా రూ.2,545.50 కోట్లు విడుదలయ్యాయని కేంద్ర గ్రామీణాభివృద్థి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. ఈ నిధుల్లో కార్మికుల వేతనాల కోసం రూ.1,414.16 కోట్లు, మెటీరియల్‌ కోసం రూ.942.77 కోట్లు, పరిపాలనా వ్యయాల కోసం రూ.188.50 కోట్లు కేటాయించారని మంగళవారం ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్థి, ఉపాధి కల్పన, స్థిరమైన జీవనోపాధి అవకాశాల సృష్టి ద్వారా వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధనలో ఏపీ ముందంజలో నిలుస్తుందని పెమ్మసాని తెలిపారు.

Updated Date - Jul 08 , 2026 | 05:13 AM