Share News

‘భవ్య’ పథకం అమలుకు రాష్ట్రస్థాయి కమిటీ

ABN , Publish Date - Jun 26 , 2026 | 05:14 AM

భారత్‌ ఔద్యోగిక్‌ వికాస్‌ యోజన (భవ్య) పథకం అమలు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటైంది.

‘భవ్య’ పథకం అమలుకు రాష్ట్రస్థాయి కమిటీ

అమరావతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి) : భారత్‌ ఔద్యోగిక్‌ వికాస్‌ యోజన (భవ్య) పథకం అమలు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటైంది. ఏపీఐఐసీ వైస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మెంబర్‌ కన్వీనర్‌గా, మరో 13 మంది వివిధ ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. ఈ కమిటీకి ఏపీఐఐసీని నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Jun 26 , 2026 | 05:17 AM