మున్సిపల్ డేటా కచ్చితత్వంపై కమిటీ
ABN , Publish Date - Apr 28 , 2026 | 04:55 AM
రాష్ట్రంలో ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణ తీరుపై జాతీయ హరిత ట్రైబ్యునల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణ తీరుపై జాతీయ హరిత ట్రైబ్యునల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డేటాలో వ్యత్యాసాలున్నాయని గమనించిన ట్రైబ్యునల్ కచ్చితమైన సమాచారం సమర్పించాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి డేటా వెరిఫికేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో మున్సిపల్ పరిపాలన, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, ప్రజారోగ్యం విభాగాల అధికారులను సభ్యులుగా నియమించింది. ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రతి నెలా 5వ తేదీ లోపు పట్టణ స్థానికసంస్థల వారీగా డేటాను కమిటీ సేకరించాల్సి ఉంటుంది. ఆ డేటాను సంబంధిత విభాగాల డేటాబేస్‌తో సరిపోల్చడం, వ్యర్థాల ఉత్పత్తి, సేకరణ, రవాణా ప్రాసెసింగ్ వివరాల్లో సరిచూసుకోవడం, పాత వ్యర్థాల తొలగింపు, భూమి పునర్వినియోగంపై నిర్ధారణ, మురుగునీటి ఉత్పత్తి, శుద్ధి సామర్థ్యం, విడుదల వివరాల పరిశీలన చేయాలి.