రాజధానిలో బంగ్లాలు, గృహ సముదాయాల కేటాయింపునకు సమన్వయ కమిటీ
ABN , Publish Date - Sep 23 , 2026 | 08:19 AM
రాజధానిలో మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల బంగ్లాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గృహ సముదాయాలకు సంబంధించిన కేటాయింపులు, అద్దెల చెల్లింపు, నిర్వహణ వంటి అంశాల సమన్వయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది.
అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): రాజధానిలో మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల బంగ్లాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గృహ సముదాయాలకు సంబంధించిన కేటాయింపులు, అద్దెల చెల్లింపు, నిర్వహణ వంటి అంశాల సమన్వయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ మేరకు సీఎస్ జి.సాయిప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా సీఎస్ ఉంటారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సాధారణ పరిపాలనశాఖ నుంచి పొలిటికల్ సెక్రటరీ, సర్వీసెస్ స్పెషల్ సీఎస్, మున్సిపల్, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖల ముఖ్య కార్యదర్శులు, న్యాయ శాఖ కార్యదర్శులుగా ఉంటారు.