పుంగనూరు రేంజర్ సస్పెన్షన్
ABN , Publish Date - May 02 , 2026 | 03:52 AM
అన్నమయ్య జిల్లా పుంగనూరు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్వో) జి.శ్రీరాములు సస్పెండయ్యారు. హైకోర్టులో న్యాయమూర్తి ఎదుట అనుచితంగా ప్రవర్తించినందుకు..
హైకోర్టులో అనుచిత ప్రవర్తనే కారణం
మదనపల్లె, మే 1(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా పుంగనూరు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్వో) జి.శ్రీరాములు సస్పెండయ్యారు. హైకోర్టులో న్యాయమూర్తి ఎదుట అనుచితంగా ప్రవర్తించినందుకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు పీవీ చలపతిరావు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 3న హైకోర్టులో విచారణ సందర్భంగా ఎఫ్‌ఆర్‌వో శ్రీరాములు ప్రవర్తన చర్చనీయాంశమైంది. సర్వీ్‌సలో ఉండి కూడా న్యాయమూర్తికి సరైన పద్ధతిలో సెల్యూట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నది ఆయనపై వచ్చిన ప్రధాన ఆరోపణ. న్యాయమూర్తి ఎదుట ఎఫ్‌ఆర్వో ప్రవర్తించిన తీరు అటవీ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని, డీఎఫ్వో తన నివేదికలో పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా, కోర్టును తప్పుదోవ పట్టించేలా ప్రవర్తించినందుకు ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్-1991 ప్రకారం ఆయనపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని అనంతపురం సర్కిల్ కన్జర్వేటర్‌కు డీఎ్‌ఫవో సిఫార్సు చేశారు.