Share News

పులుల మృతిపై ఉన్నత స్థాయి విచారణ

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:12 AM

నల్లమలలో పులు ల మరణాలపై విశ్రాంత ఐఎఫ్ఎస్‌ అధికారి పి.మల్లికార్జునరావు నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు..

పులుల మృతిపై ఉన్నత స్థాయి విచారణ

మంగళగిరి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): నల్లమలలో పులు ల మరణాలపై విశ్రాంత ఐఎఫ్ఎస్‌ అధికారి పి.మల్లికార్జునరావు నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు ఏపీ అటవీ శాఖ ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి పీవీ చలపతిరావు మీడియాకు తెలిపారు. రెండు పులులు వృద్ధాప్యంతో, మరో పులి ముళ్ల పందిని వేటాడుతూ చనిపోయినట్టు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. రాచర్ల బీట్‌లో వేటగాళ్ల కాల్పుల్లో ఒక పులి చనిపోగా, అనుమానితులను అదుపులోకి తీసుకుని పులిగోర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

Updated Date - Aug 07 , 2026 | 05:13 AM