Share News

కోనసీమలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు

ABN , Publish Date - May 13 , 2026 | 04:43 AM

రాష్ట్రంలో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు.

కోనసీమలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలు

  • అధికారులతో సమీక్షలో మంత్రి కొండపల్లి

అమరావతి, మే 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొబ్బరి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో కాయర్‌ బోర్డు, సెర్ప్‌, ఎంఎ్‌సఎంఈ, ఉద్యానశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోనసీమ ప్రాంతంలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలను నెలకొల్పి, ఎగుమతులను ప్రోత్సహించి రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ప్రారంభించిన క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రిఫరెన్స్‌ ఫెసిలిటీని మంత్రి కొండపల్లి మంగళవారం సందర్శించారు. ప్రాముఖ్యత గురించి నిపుణులను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - May 13 , 2026 | 04:43 AM