Share News

మత్స్యకారుల సంక్షేమానికి కృషి: ఆఫ్కాఫ్‌ చైర్మన్‌

ABN , Publish Date - Jun 26 , 2026 | 05:03 AM

ఏపీలో మత్స్యకారుల సంక్షేమానికి వివిధ పథకాల అమలుపై జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు అధికారులతో రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య (ఆఫ్కాఫ్‌) చైర్మన్‌ యాటగిరి రాంప్రసాద్‌ చర్చించారు.

మత్స్యకారుల సంక్షేమానికి కృషి: ఆఫ్కాఫ్‌ చైర్మన్‌

అమరావతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఏపీలో మత్స్యకారుల సంక్షేమానికి వివిధ పథకాల అమలుపై జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు అధికారులతో రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య (ఆఫ్కాఫ్‌) చైర్మన్‌ యాటగిరి రాంప్రసాద్‌ చర్చించారు. గురువారం ఎన్‌ఎ్‌ఫడీబీ సీఈవో బహేరా, ఇతర అధికారులతో ఆఫ్కాఫ్‌ చైర్మన్‌, డైరెక్టర్లు సమావేశమయ్యారు. రాష్ట్రంలో మత్స్యకారులకు గ్రాంట్ల రూపంలో వచ్చే నిధుల గురించి చైర్మన్‌ రాంప్రసాద్‌ ఆరా తీశారు. ఆక్వాకు సంబంధించి ప్రత్యేక పథకాలు, బీమా, డీప్‌ సీ బోట్లు గురించి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర పథకాలను ఉపయోగించి, రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి మరింత కృషి చేస్తామని ఆయన చెప్పారు. అమరావతిలో ఎన్‌ఎ్‌ఫడీబీ కార్యాలయ నిర్మాణానికి రెండెకరాలు ఇవ్వడానికి సీఎం అంగీకరించిన విషయాన్ని ఆయన సీఈవో దృష్టికి తీసుకెళ్లారు.

Updated Date - Jun 26 , 2026 | 05:03 AM