మత్స్యకారుల్లో చీలిక తెస్తే సహించం: ఆఫ్కాస్
ABN , Publish Date - May 15 , 2026 | 05:02 AM
మత్స్యకారుల్లో చీలిక తేవాలని ఎవరైనా ప్రయత్నిస్తే తగిన బుద్ధి చెప్తామని మత్స్యకార సహకార సమాఖ్య చైర్మన్ యాటగిరి రాంప్రసాద్ హెచ్చరించారు.
అమరావతి, మే14 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల్లో చీలిక తేవాలని ఎవరైనా ప్రయత్నిస్తే తగిన బుద్ధి చెప్తామని మత్స్యకార సహకార సమాఖ్య చైర్మన్ యాటగిరి రాంప్రసాద్ హెచ్చరించారు. గురువారం విజయవాడలోని ఆఫ్కాస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మత్స్యకారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు అమలు కోసం నోటిఫికేషన్ ఇచ్చి 48 పోస్టులు భర్తీ చేశాం. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.5లక్షల దాకా వసూలు చేసినట్లు జగన్ పత్రికలో రాయడం దుర్మార్గం. తప్పుడు రాతలకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు.