చేపల వేట నిషేధాన్ని ఉల్లంఘిస్తే చర్యలు
ABN , Publish Date - Apr 09 , 2026 | 04:46 AM
రాష్ట్ర ప్రాదేశిక సముద్ర జలాల్లో ఈ నెల15 నుంచి జూన్14 వరకు మెకనైౖజడ్, మోటరైజడ్ బోట్లతో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధించినట్లు...
మత్స్యశాఖ కమిషనర్ హెచ్చరిక
అమరావతి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రాదేశిక సముద్ర జలాల్లో ఈ నెల15 నుంచి జూన్14 వరకు మెకనైౖజడ్, మోటరైజడ్ బోట్లతో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధించినట్లు మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్‌నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిషేధాన్ని ఉల్లంఘించి, వేట సాగిస్తే.. ఏపీ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం కింద శిక్షార్హులవుతారని హెచ్చరించారు.