Share News

వినికిడి లోపం విద్యార్థుల డిగ్రీ కాలేజ్‌ అడ్మిషన్లు!

ABN , Publish Date - Aug 21 , 2026 | 04:39 AM

వినికిడి లోపం విద్యార్థుల డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లకు ఈనెల 23వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జెండర్‌, వయోవృద్ధుల..

వినికిడి లోపం విద్యార్థుల డిగ్రీ కాలేజ్‌ అడ్మిషన్లు!

  • 23 నుంచి దరఖాస్తుల ఆహ్వానం

బాపట్ల, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): వినికిడి లోపం విద్యార్థుల డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లకు ఈనెల 23వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్‌జెండర్‌, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎస్‌.వెంకటరవణప్ప తెలిపారు. వారి కోసం రాష్ట్రంలోనే మొదటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బాపట్ల జిల్లా వెదుళ్లపల్లిలో ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్టు గురువారం ఒక ప్రకటనలో వివరించారు. 2026-27 విద్యా సంవత్సరంలో 30 సీట్లతో ఏఐ సర్టిఫికేషన్‌ కోర్సుతో బి.కాం(కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ ప్రధాన సబ్జెక్టుగా) అందిస్తున్నట్టు తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులు దరఖాస్తులు సమర్పించవచ్చని, మరిన్ని వివరాలకు 90000 13633, 99483 72899 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 04:40 AM