అర్హులందరికీ పదోన్నతులు
ABN , Publish Date - May 05 , 2026 | 04:58 AM
ఆర్థిక శాఖ, దాని పరిధిలోని హెచ్‌ఓడీలు, వాణిజ్య పన్నుల శాఖల్లో పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను త్వరగా పూర్తిచేయాలని ఆ శాఖల మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశం
అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): ఆర్థిక శాఖ, దాని పరిధిలోని హెచ్‌ఓడీలు, వాణిజ్య పన్నుల శాఖల్లో పెండింగ్‌లో ఉన్న పదోన్నతులను త్వరగా పూర్తిచేయాలని ఆ శాఖల మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ అహ్మద్ బాబుతో మంత్రి పయ్యావుల భేటీ అయ్యారు. అర్హులందరికీ పదోన్నతులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. 1999 గ్రూప్ - 2 నోటిఫికేషన్ సీనియారిటీకి సంబంధించి కోర్టు కేసుల వల్ల తలెత్తిన అడ్డంకులను వెంటనే తొలగించాలని, ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన రీతిలో సమస్యను పరిష్కరించాలని సూచించారు.