ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై హర్షం
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:26 AM
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసి విద్యార్థుల చదువుకు మంత్రి లోకేశ్ భరోసా కల్పించారని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు కొనియాడారు.
మంత్రి లోకేశ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన శాప్ చైర్మన్ రవినాయుడు
విజయవాడ సిటీ, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసి విద్యార్థుల చదువుకు మంత్రి లోకేశ్ భరోసా కల్పించారని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు కొనియాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల పట్ల హర్షం వ్యక్తంచేస్తూ విద్యా శాఖ మంత్రి లోకేశ్ చిత్ర పటానికి విజయవాడలోని ఈట్ స్ట్రీట్ వద్ద బుధవారం ఆయన పాలాభిషేకం చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా బకాయిలు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.