చుక్కచుక్కా పోసి... నారు మడిని తడిపి..!
ABN , Publish Date - Jul 16 , 2026 | 05:36 AM
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులు వరినారు పోసుకున్నారు. వారం రోజులుగా ఎండల తీవ్రత అధికమైంది. దీనికితోడు ఎల్‌నినో ప్రభావంతో జూలై మూడో వారం..
ఇంటర్నెట్ డెస్క్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. రైతులు వరినారు పోసుకున్నారు. వారం రోజులుగా ఎండల తీవ్రత అధికమైంది. దీనికితోడు ఎల్‌నినో ప్రభావంతో జూలై మూడో వారం వచ్చినా సరైన వర్షాలు లేవు. దీంతో వరినారు ఎండిపోతోంది. దాన్ని రక్షించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోకవర్గంలో కొందరు రైతులు చంపావతి నది నుంచి డ్రమ్ములలో నీరు తెచ్చుకుని నారుమడులను తడుపుతున్నారు. రెండు, మూడు రోజుల్లో వర్షం అనుకూలించకపోతే నారు ఎండిపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు.
- గజపతినగరం, ఆంధ్రజ్యోతి