రైతుల ఖాతాల్లో 14 వేల కోట్లు జమ: అచ్చెన్న
ABN , Publish Date - Aug 21 , 2026 | 05:04 AM
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 14,664.33 కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 14,664.33 కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం శాసనసభలో ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, వేగుళ్ల జోగేశ్వరరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గొడ్డలి పార్టీ నాయకులు అసెంబ్లీకి రాకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ధైర్యం ఉంటే సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని సవాల్ విసిరారు.