Share News

ప్రైవేటు వర్సిటీల్లో ఫీజులకు గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - Feb 12 , 2026 | 02:07 AM

ప్రైవేటు యూనివర్సిటీల్లో కన్వీనర్‌ కోటా కింద అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఫీజుల కష్టాలు తొలగనున్నాయి. 2024-25, 2025-26 విద్యా సంవత్సరాల్లో ప్రైవేటు యూనివర్సిటీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వర్తింపును పొడిగిస్తూ ...

ప్రైవేటు వర్సిటీల్లో ఫీజులకు గ్రీన్‌సిగ్నల్‌

అమరావతి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు యూనివర్సిటీల్లో కన్వీనర్‌ కోటా కింద అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఫీజుల కష్టాలు తొలగనున్నాయి. 2024-25, 2025-26 విద్యా సంవత్సరాల్లో ప్రైవేటు యూనివర్సిటీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వర్తింపును పొడిగిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రైవేటు యూనివర్సిటీల్లో 35శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీచేసేలా గత ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీల చట్టంలో సవరణలు చేసింది. అయితే ఫీజుల చెల్లింపుపై స్పష్టతను విస్మరించింది. ఫలితంగా ప్రతి సంవత్సరం ఫీజుల విడుదలకు ప్రత్యేకంగా అనుమతుల జీవో ఇవ్వాల్సి వస్తోంది. ఆ జీవో జారీలో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ఆ విద్యార్థులకు ఫీజులు నిలిచిపోయాయి. తాజా ఉత్తర్వులతో ప్రభుత్వం ఫీజులు విడుదల చేయనుంది.

Updated Date - Feb 12 , 2026 | 02:07 AM