పీఏసీఎస్ కమిటీల గడువు పెంపు
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:59 AM
రాష్ట్రంలోని 2,024 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎ్‌స)లకు అధికార, అధికారేతర పర్సన్ ఇన్‌చార్జి కమిటీ గడువును ప్రభుత్వం ఈ నెల 31 నుంచి జూలై 30 వరకు...
అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 2,024 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎ్‌స)లకు అధికార, అధికారేతర పర్సన్ ఇన్‌చార్జి కమిటీ గడువును ప్రభుత్వం ఈ నెల 31 నుంచి జూలై 30 వరకు (ఆరు నెలలు) పొడిగించింది. ఈమేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1,903 పీఏసీఎ్‌సలకు ప్రస్తుత అధికారేతర పర్సన్ ఇన్‌చార్జి కమిటీలను పొడిగించగా, కొన్ని పీఏసీఎ్‌సలకు అధికారులను కొనసాగిస్తూ, కొన్ని కమిటీల్లో స్వల్పమార్పు చేర్పులు చేశారు. కాగా ప్రస్తుత రబీ మార్కెటింగ్ సీజన్‌లో కనీస మద్దతు ధరకు వివిధ పంట ఉత్పత్తుల సేకరణకు ప్రభుత్వం నోడల్ ఏజెన్సీలను నియమించింది. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల తరుపున వేరుశనగ సేకరణకు ఏపీ ఆయిల్‌ఫెడ్, శనగలు, కందులు, మినుములు, పెసలు కొనుగోలుకు ఏపీ మార్క్‌ఫెడ్‌ను రాష్ట్రస్థాయి నోడల్ ఏజెన్సీగా నియమించింది. రాష్ట్రంలో కోకో పంటకు ధరల నిర్ణయానికి ఉద్యాన శాఖ డైరెక్టర్ అఽధ్యక్షతన కమిటీని నియమించింది. సీనియర్ అధికారులతోపాటు, కేఎల్ వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ జాకబ్ విక్టర్‌ను సభ్యులుగా నియమించింది.