Share News

ఇంటి పన్నుపై వడ్డీ రాయితీ మరో నెల పొడిగింపు

ABN , Publish Date - Apr 14 , 2026 | 05:48 AM

రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి, ఖాళీ స్థలాల పన్ను బకాయిలను మార్చి 31లోపు చెల్లించిన వారికి 50 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామని మున్సిపల్‌ శాఖ ఇప్పటికే ప్రకటించింది

ఇంటి పన్నుపై వడ్డీ రాయితీ మరో నెల పొడిగింపు

  • ఏప్రిల్‌ నెలాఖరులోపు పన్ను చెల్లిస్తే 5శాతం రాయితీ

ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తి, ఖాళీ స్థలాల పన్ను బకాయిలను మార్చి 31లోపు చెల్లించిన వారికి 50 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామని మున్సిపల్‌ శాఖ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా ఈ రాయితీ గడువును ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తూ మున్సిపల్‌ శాఖ ఆదేశాలిచ్చింది. అదేవిధంగా 2026-27 ఆర్థిక సంవత్సరం ఇంటిపన్ను, ఖాళీ స్థలాల పన్ను మొత్తాన్ని ఏప్రిల్‌ 30 లోపు చెల్లిస్తే, వారికి ఐదు శాతం రాయితీని కల్పిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీడీఎంఏ సంపత్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో కోరారు.

Updated Date - Apr 14 , 2026 | 05:49 AM