Share News

ఇంజనీరింగ్‌ సీట్లు 1,84,970

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:51 AM

రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే అదనంగా మరో 6600 ఇంజనీరింగ్‌ సీట్ల పెంపునకు అఖిల భా రత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతిచ్చింది.

ఇంజనీరింగ్‌ సీట్లు 1,84,970

  • రాష్ట్రంలో అదనంగా 6600 సీట్ల పెంపునకు ఏఐసీటీఈ అనుమతి

అమరావతి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గతేడాదితో పోలిస్తే అదనంగా మరో 6600 ఇంజనీరింగ్‌ సీట్ల పెంపునకు అఖిల భా రత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతిచ్చింది. దీంతో రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి మొత్తం సీట్ల సంఖ్య 1,84,970కు చేరింది. పలు కాలేజీలు ప్రైవేటు యూనివర్సిటీలుగా మారిపోయిన నేపథ్యంలో ఇంజనీరింగ్‌ కాలేజీల సంఖ్య తగ్గింది. గతేడాది 243 కాలేజీలుంటే ఈ ఏడాది 234కు తగ్గింది. 17 ప్రభుత్వ కాలేజీల్లో 6130 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు కాలేజీలు 217 ఉండగా, 1,78,840 సీట్లు ఉన్నాయి. మొత్తం ఇంజనీరింగ్‌ సీట్లలో సీఎ్‌సఈ, దాని అనుబంధ బ్రాంచ్‌ల సీట్లే 65.22 శాతానికి చేరడం గమనార్హం. కొత్తగా వైఎ్‌సఆర్‌ ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీలో ఏఐ అండ్‌ ఎంఎల్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌ (కనస్ట్రక్షన్‌ టెక్నాలజీ) కోర్సులను ప్రవేశపెట్టారు. కలికిరిలోని జేఎన్‌టీయూ అన ంతపురం వర్సిటీ కాలేజీలో సీఎ్‌సఈ-ఏఐఎంఎల్‌, పులివెందులలోని జేఎన్‌టీయూ అనంతపురం వర్సిటీ కాలేజీలో సీఎ్‌సఈ-ఏఐఎంఎల్‌, ఈసీఈ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని స్కూల్‌ ఇఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో ఏఐ అండ్‌ డేటా సైన్స్‌ కోర్సులు కొత్తగా తీసుకొచ్చారు. మొత్తంగా ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో 390, ప్రైవేటు కాలేజీల్లో 6210 సీట్లు పెరిగాయి. ఈ కాలేజీల్లో 70 శాతం కన్వీనర్‌ కోటా సీట్లు ఉంటాయి. ఇవి కాకుండా ప్రైవేటు యూనివర్సిటీల్లో ఉండే సీట్లలో 35 శాతం సీట్లు కన్వీనర్‌ కోటా పరిధిలోకి వస్తాయి. 65 శాతం సీట్లను ఆయా ప్రైవేటు వర్సిటీలు సొంతంగా భర్తీ చేసుకుంటాయి. ఏఐసీటీఈ మంజూరు చేసిన సీట్లకు త్వరలో ఉన్నత విద్యాశాఖ అనుమతులు జారీచేస్తుంది. ఆ తర్వాత కౌన్సెలింగ్‌ పరిధిలోకి వస్తాయి.

Updated Date - Jun 20 , 2026 | 04:52 AM