Share News

కాన్వాయ్‌ పక్కన పెట్టి.. బైక్‌పై పర్యటన

ABN , Publish Date - May 18 , 2026 | 04:57 AM

పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశమంతా పొదుపు చర్యలు చేపడుతోంది. ఇంధన పొదుపు మంత్రం పాటించాలని..

కాన్వాయ్‌ పక్కన పెట్టి.. బైక్‌పై పర్యటన

  • విద్యుత్‌ మంత్రి రవికుమార్‌ ‘ఇంధన’ పొదుపు

అద్దంకి, మే 17 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశమంతా పొదుపు చర్యలు చేపడుతోంది. ఇంధన పొదుపు మంత్రం పాటించాలని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అందుకు అనుగుణంగా విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ఆదివారం తన అధికారిక పర్యటనలో కాన్వాయ్‌ను పక్కనపెట్టారు. ఓ టీడీపీ కార్యకర్తకు చెందిన బుల్లెట్‌ బైక్‌పై దాదాపు 7 కిలోమీటర్ల మేర ప్రయాణించి.. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొటికలపూడి పంచాయతీ పరిధిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఆయా కార్యక్రమాలకు వెళ్లిన టీడీపీ నేతలందరు కూడా ద్విచక్రవాహనాలపైనే ప్రయాణించారు.

Updated Date - May 18 , 2026 | 05:59 AM